TG: జూన్ 16న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

66చూసినవారు
TG: జూన్ 16న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్ బోర్డు బిగ్ అలర్ట్ జారీ చేసింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 16న విడుదల చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మే 22 నుంచి 29 వరకు జరిగిన ఈ పరీక్షలకు 4.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సహా మార్కులు పెంచుకోవాలనుకున్న వారు కూడా ఈ పరీక్షలు రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్