తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టిన ఈ నెల 5న ఇందిరాపార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్ మహా ధర్నాను జరిపి తీరుతామని రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం చేసింది. ధర్నాకు ఆటంకం కలిగించడానికి సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా.. వెనుకడుగు వేయకుండా డ్రైవర్లంతా తరలిరావాలని పిలుపునిచ్చింది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని.. అన్ని వాహన సంఘాలతో కలిపి మహాధర్నా విజయవంతం చేస్తామని తెలిపారు.