తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ ను రైతుల ఖాతాల్లో వేస్తుంది. అయితే శనివారం సుమారు రూ.కోటికి పైగా బోనస్ చెక్కులపై సివిల్ సప్లై శాఖ సంతకాలు చేసి జారీ చేసింది. 48 గంటల్లో రైతు ఖాతాల్లోకి 500 బోనస్ డబ్బులు చేరనున్నాయని అధికారులు తెలిపారు. దీంతో ఆ డబ్బులు సోమవారం రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. ఈనెల 11న శాంపిల్‌గా ఓ రైతు ఖాతాలోకి రూ.500 బోనస్ చొప్పున రూ.30,000 లను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది.