తెలంగాణలో నిత్య పెళ్లి కొడుకు బాగోతం ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా కన్నాల గ్రామానికి చెందిన నాగుల జ్యోతితో దేవేందర్ వివాహం జరిగింది. అప్పటికే మరో అమ్మాయిని దేవేందర్ వివాహం చేసుకుకున్నారు. ముచ్చటగా మూడో పెళ్లికి దేవేందర్ సిద్ధమవుతున్నట్లు తెలుసుకుని భర్త ఇంటి వద్ద భార్య జ్యోతి బైఠాయించింది. దీంతో నిత్య పెళ్ళికొడుకు బాగోతం బయటపడింది.