తెలంగాణలోని 8 మెడికల్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. త్వరలోనే 3000 పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. వీటితో పాటు ఏటూరునాగారం ఫైర్ స్టేషన్ కు 34 సిబ్బంది మంజూరు, కోస్గిలో ఇంజినీరింగ్ కాలేజీ, హకీంపేటలో జూనియర్ కాలేజీ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లలో SLBC టన్నెల్ పనులు పూర్తి చేసేలా రూ.4,637 కోట్ల నిధులను మంజూరు చేసింది.