ఆంధ్రలో బర్డ్‌ప్లూ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలను తిప్పి పంపుతోంది. ఈ క్రమంలోనే 24 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే కేంద్రం కూడా చికెన్, కోడి గుడ్లు వినియోగం తగ్గించాలని ఆదేశించింది. ఏపీలో ఈ వైరస్ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.