TG: పదేళ్లలో 3 లక్షలకు పైగా కుక్కకాటు కేసులు

64చూసినవారు
TG: పదేళ్లలో 3 లక్షలకు పైగా కుక్కకాటు కేసులు
తెలంగాణలో కుక్కకాటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏటా దాదాపు 30 వేలు.. రోజుకు సుమారు 90 కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి. గత ఏడాది దాదాపు 26 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. 2019 జనవరి నుంచి 2024 ఏప్రిల్ 17 వరకు రేబిస్‌తో 54 మంది మృతి చెందారు. రికార్డుల ప్రకారం GHMC పరిధిలో దాదాపు 6 లక్షల వీధి కుక్కలు తిరుగుతున్నాయి. గ్రామాల్లో సైతం కుక్కలు స్వైరవిహారం చేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

సంబంధిత పోస్ట్