TG: ఆస్తి తగాదాలు.. 2 రోజులుపాటు ఇంటి ముందే తండ్రి మృతదేహం

63చూసినవారు
యాదాద్రి (D) మోత్కూరు (M) సదర్‌ షాపురంలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తి తగాదాల కారణంగా 2 రోజులపాటు ఇంటి ముందే తండ్రి మృతదేహం శవపేటికలోనే ఉంచారు. ఆలకుంట్ల బాలయ్య (62), లింగమ్మ దంపతులకు నలుగురు సంతానం. బాలయ్య ఈ నెల 21న అనారోగ్యంతో మృతిచెందారు. అంత్యక్రియలు చేసే సమయంలో ఇద్దరు కుమారులు నరేశ్‌, సురేశ్‌ల మధ్య గొడవ జరిగింది. లింగమ్మకు చెందిన భూమి పెద్ద కోడలి పేరు మీద పట్టా చేసి ఉంది. దీంతో తన వాటా తేల్చే వరకు అంత్యక్రియలు చేసేది లేదని చిన్నకొడుకు సురేశ్‌ అడ్డుపడ్డాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్