తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, HYD, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.