సంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పోక్సో కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్ల బాలికపై గపూర్ (56) అనే వ్యక్తి కూల్ డ్రింక్ లో మద్యం కలిపి అత్యాచారం చేశాడు. దీంతో అతడికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దోషి బానూరులో నివాసం ఉంటున్నట్లు, బీహార్ కు చెందినవాడిగా గుర్తించారు.