TG: విద్యార్థిని కరిచిన ఎలుక.. చచ్చుబడిన అవయవాలు (వీడియో)

68చూసినవారు
తెలంగాణలోని ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బాలికల గురుకులంలో దారుణ ఘటన జరిగింది. టెన్త్ విద్యార్థిని కీర్తిని ఎలుక కరిచిన ఘటనలో ఆమె కాలు, చేయి చచ్చుబడిపోయాయి. అయితే పలుమార్లు ఎలుక కరవడంతో టీచర్లు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి రాబిస్ వ్యాక్సిన్ ఇప్పించారు. పరిమితికి మించి వ్యాక్సిన్ వేయడం వల్లే ఇలా జరిగిందని బాలిక తల్లి ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం బాలిక ప్రాణాల మీదికి తెచ్చిందని హరీశ్ రావు మండిపడ్డ విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్