దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులు హైదరాబాద్ తిరుగుప్రయాణం అవడంతో టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బతుకమ్మ, దసరా ఉత్సవాలు ముగియడంతో ప్రజలు HYD బాట పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్(M) పంతంగి టోల్ ప్లాజా తో పాటు చౌటుప్పల్ NHపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు HYD వైపు వెళ్లే వాహన లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ ను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.