తెలంగాణలో పాఠశాల విద్యను డిజిటల్ మోడ్‌లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. AIని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా స్కూల్ విద్యలో విప్లవాత్మక మార్పు తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులను ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ ఇంప్రూవ్ చేయడంలో AIని వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక వినియోగంపై టీచర్లకు శిక్షణ ఇవ్వనుంది. దీనిలో భాగంగా Ekstep ఫౌండేషన్‌ను విద్యాశాఖ అధికారులు సందర్శించనున్నారు.