TG: ఫీజు చెల్లించలేదని.. చిన్నారులను బంధించిన స్కూల్ సిబ్బంది (వీడియో)

61చూసినవారు
నల్గొండ జిల్లా దేవరకొండ లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు చెల్లించలేదని ఇద్దరు చిన్నారులు చైత్ర, జాహ్నవి లను పాఠశాలలోనే యాజమాన్యం బంధించింది. విద్యార్థినులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్కూల్ సిబ్బందికి ఫోన్ చేశారు. పిల్లల్ని తమవద్దే ఉంచుకున్నామని, ఫీజు చెల్లించి తీసుకెళ్లాలని అనడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాకైయ్యారు. స్కూల్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా.. తల్లిదండ్రులకు, సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి.

సంబంధిత పోస్ట్