TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సోమవారం(ఫిబ్రవరి3) సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి. అంతకముందు రాష్ట్ర హైకోర్టు తమ పిటిషన్‌లను కొట్టేయడంతో అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.