TG: హనుమకొండలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్? (వీడియో)

66చూసినవారు
హనుమకొండ మెడికవర్ హాస్పిటల్‌లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయినట్లు తెలుస్తోంది. పర్వతగిరికి చెందిన గుడ్ల చిన్న సుశీల(72) బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో మెడికవర్‌లో చేరారు. ఆపరేషన్‌కు ముందే రూ. 2,10,000 వసూలు చేసి ఒకేసారి 2 సర్జరీలు చేశారని ఆమె బంధువులు తెలిపారు. వారం రోజులుగా సుశీలకు బ్లడ్ ఎక్కించి, డయాలసిస్ చేసి.. ECG అంటూ హడావుడి చేసి, చివరికి చనిపోయిందని చెబుతున్నారని వెల్లడించారు. చనిపోయిన మనిషికే ట్రీట్ మెంట్ చేశారని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్