హైదరాబాద్ పరిధిలో ఓ వైద్యురాలు చనిపోతూ నలుగురికి ప్రాణం పోసిన ఘటన జరిగింది. ఇటీవల రంగారెడ్డి (D) నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో యశ్వంత్ అనే డాక్టర్ మృతి చెందగా.. మరో డాక్టర్ భూమికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స అందించగా.. భూమికకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. భూమిక పేరెంట్స్ అంగీకారంతో ఆమె గుండె, లివర్, కళ్లు, కిడ్నీలు మరొకరికి దానం చేయడంతో నాలుగు ప్రాణాలు ఊపిరి పోసుకున్నాయి.