రైతు భరోసా పథకానికి (ఏడాదికి రూ.12 వేలు) అర్హులైన రైతులు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ వెల్లడించింది. జనవరి 1, 2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. దరఖాస్తుదారులు పట్టాదారు పాస్ పుస్తకం/డిజిటల్ సంతకం, అధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్, పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారంతో సదరు పత్రాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారికి సమర్పించాలని సూచించింది.