కరీంనగర్‌లోని ఓ ప్రాంత వాసులు భిన్నంగా ప్రతీఏటా శ్మశాన వాటికలో దీపావళి వేడుకలు జరుపుకుంటుంటారు. జిల్లాలోని కార్ఖానా గడ్డలో ఉన్న హిందూ స్మశాన వాటికలో కొన్ని దళిత కుటుంబాలు శ్మశాన వాటికలోనే దీపావళి వేడుకలను జరుపుకుంటూ వస్తున్నారు. చనిపోయిన తమ పెద్దలను గుర్తు చేసుకుంటూ సమాధుల మధ్య వేడుకలు జరుపుకుంటారు. పండుగకు వారం రోజుల ముందే తమ కుటుంబ పెద్దల సమాధులను శుభ్రం చేసి,పూలతో అలంకరిస్తారు. పండుగరోజు అక్కడే టపాసులు కాలుస్తారు.