భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలిపటం దారం తగిలి గొంతు తెగిన ఘటన గురువారం జరిగింది. కొత్తగూడెం హెరిటేజ్ కంపెనీలో గుర్రాయిగూడెం వాసి ఏరువా కృష్ణారావు పని పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా జాతీయ రహదారిపై మాంజా దారం తాకి గొంతు కోసుకుపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.