విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న తమ సిబ్బందిని TGSRTC యాజమాన్యం బుధవారం హైదరాబాద్ బస్ భవన్ లో ఘనంగా సన్మానించింది. చోరీ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ కోటేశ్వరరావును, గర్భిణి ప్రసవంలో సహాయం చేసిన కండక్టర్ కిషోర్ కుమార్, డ్రైవర్ నరేందర్ గౌడ్ ను, ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో CPR చేసి కాపాడిన డీఎం సునీతలను అభినంధించడం పాటు.. ఎండీ వీసీ సజ్జనార్ వారిని సన్మానించారు.