ఐదు రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్న తండా వాసులు

63చూసినవారు
ఐదు రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్న తండా వాసులు
TG: సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలం పులగంబండా తండాలో గ్రామస్తులు తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ బోరు మోటార్ కాలిపోయి పులగంబండా తండాలో గత 5 రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమి లేక పొలం గట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. మరమ్మతులు చేయమని అధికారులకు చెప్పినా వారు.. పట్టించుకోవడం లేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్