తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలోనే యువతి దుర్మరణం
AP: తాడిపత్రి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ రెడ్డి, లక్ష్మీదేవిలకు గీత (24) పెద్ద కుమార్తె ఉంది. తల్లి ఆనారోగ్యంతో ఉండటంతో గీతకు పెళ్లి చేయాలనుకున్నారు. ఓ సంబంధం కుదరడంతో ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్నారు. గీత గోరింటాకు పెట్టించుకోవడానికి సోదరుడు నారాయణరెడ్డితో కలిసి బైక్పై తాడిపత్రి వెళ్లింది. పని అయిపోయాక తిరిగి వస్తుండగా.. ట్రాక్టర్ ఢీకొనడంతో గీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కన్నవారిని తీవ్ర విషాదంలో ముంచింది.