TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో
సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఆనాడు ఇందిరా గాంధీని అమ్మ అన్నారు. ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు. నన్ను రేవంత్ అన్న అంటున్నారు. అంటే నేను మీ కుటుంబ సభ్యుడిని. ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉండి. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేద్దాం' అని CM తెలిపారు.