పంద్రాగస్టు-2026 లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ అన్నారు. 'రాష్ట్ర వ్యాప్తంగా 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. నియోజకవర్గానికి 3,500 చొప
్పున ఇళ్లు అందిస్తాం. 6 గ్యారంటీల అమలుకు నిరంతరం కష్టపడుతున్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, కోమటిరెడ్డి, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.