KCRపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రశంసించారు. కేసీఆర్ దూరదృష్టితో, గుడులపై అభిలాషతో యాదగిరిగుట్టను గొప్పగా కట్టారని సుఖేందర్ రెడ్డి చెప్పారు. యాదగిరి గుట్టను అద్భుతంగా కట్టారని కేసీఆర్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్ అసెంబ్లీలో అభినందించారు. దీంతో ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేలా కేసీఆర్ పనులు చేశారనడానికి ఇదే నిదర్శనమని ఆ వీడియోలను BRS శ్రేణులు నెట్టింట వైరల్ చేస్తున్నాయి.