దక్షిణాఫ్రికా క్రికెటర్ హేన్రిచ్ క్లాసెన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించారు. 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలనే లక్ష్యంతో ఉన్నానని, అయితే తమ క్రికెట్ బోర్డుతో తలెత్తిన సమస్యల కారణంగా అలసిపోయానని చెప్పారు. హెడ్ కోచ్‌గా రాబ్ వాల్టర్ ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేవన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని క్లాసెన్ స్పష్టం చేశారు.