తెలంగాణలో అమలవుతున్న కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామని సీఎం రేవంత్ అన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని చెప్పారు. ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనమని తెలిపారు. ఎంతో జటిలమైన SC ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు.