తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు. 'హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా? ఇవ్వరా? అనే దానిపై క్లారిటీ లేదు. ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ చెప్పాలి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు చేస్తాం' అని పిలుపునిచ్చారు.