తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మార్చి 31 లోపు ప్రతి సెగ్మెంట్‌లో 3,500 చొప్పున 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని CM రేవంత్ ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం రూ.22,500 కోట్ల ఖర్చు చేయనుందని తెలిపారు. రుణమాఫీ, ఉద్యోగాలు, మహిళలకు ఫ్రీ టికెట్, రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు సరిపోవన్నారు. అందుకే కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.