బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ విచారం వ్యక్తం చేశారు. ‘అది చాలా విచారకరమైన ఘటన. బెంగళూరు ప్రజలకు క్రీడలంటే చాలా ఇష్టం. ఫుట్‌బాల్, కబడ్డీ.. అన్నీ జట్లనూ అనుసరిస్తారు. ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం నిజంగా హృదయ విదారకం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ద్రవిడ్ అన్నాడు.