పారిస్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు స్పాన్సర్‌గా అదానీ గ్రూప్

50చూసినవారు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు స్పాన్సర్‌గా అదానీ గ్రూప్
మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్‌కు ప్రపంచ క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తోంది. ఎప్పటిలాగే భారత్ ఈసారి కూడా ఒలింపిక్స్‌కు భారీ బృందాన్ని పంపుతోంది. 113 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందానికి పారిస్ ఒలింపిక్స్ లో అదానీ గ్రూప్ ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ మేరకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్