ప్రియురాలి మరణంతో కలత చెందిన ఓ యువకుడు ఆమె చితిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇద్దరి ప్రేమికుల మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు మద్యం సేవించి, ఆ మత్తులో ఆమె చితిలో దూకడానికి ప్రయత్నించాడు. అక్కడున్న వాళ్లు అడ్డుకుని దేహశుద్ధి చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కామలి పోలీసులు కేసు నమోదు చేశారు.