పెళ్లి మండపం ఎక్కాల్సిన పెళ్లికొడుకు.. అంతలోనే ప్రమాదం

54చూసినవారు
పెళ్లి మండపం ఎక్కాల్సిన పెళ్లికొడుకు.. అంతలోనే ప్రమాదం
TG: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు ఓ యువకుడు. కానీ ఇంతలోనే అనుకోని ప్రమాదం అతడిని హాస్పిటల్ బెడ్ ఎక్కేలా చేసింది. కాసేపట్లోనే పసుపు బట్టల్లో మెరిసిపోవాలని కలలు కన్న ఆ యువకుడు గాయాలతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన మలక్ పేట పరిధిలో జరిగింది. మలక్‌పేట నల్గొండ x రోడ్ వద్ద ఓ కారు డివైడర్‌పైకి దూసుకువెళ్లింది. ఆ సమయంలో వాహనంలో ఒక యువకుడు ఉండగా.. అతను పెళ్లి కొడుకుగా స్థానికులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్