బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఎగిరిపడ్డారు (వీడియో)

245910చూసినవారు
యూపీలోని ఆగ్రాలో ఆదివారం షాకింగ్ ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వారిని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. వారికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్