కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్‌ను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ శాంతి చర్చల కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం తెలిపారు. కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న పేదరికాన్ని తొలగిస్తే వామపక్ష ఉగ్రవాదం ఉండదని తమ్మినేని వెల్లడించారు.