తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రం ఓపెన్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించినందుకు గాను రాష్ట్రానికి రావాల్సిన రూ.వేల కోట్ల నిధులను చెల్లించలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ద్వారా 'కేంద్రం మాపై జులుం ప్రదర్శిస్తోంది. హక్కుల కోసం నిలబడినందుకు విద్యార్థులను శిక్షిస్తుంది' అంటూ ట్వీట్ చేశారు.