డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం సరైన పద్ధతిలో చెయ్యాలని సీఎం రేవంత్ అన్నారు. 'దశాబ్దాలపాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దక్షిణాదిని శిక్షిస్తున్నారా? దక్షిణాది రాష్ట్రాల ప్రజలను విస్మరిస్తే.. బీహార్, MP, రాజస్థాన్, UP రాష్ట్రాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి' అని వ్యాఖ్యానించారు.