అమ్మను చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన ఖమ్మం (D) రూరల్(M) ఎంవీపాలెంలో సోమవారం జరిగింది. కుర్ర వినోద్, లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక(4). సోమవారం లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసి ఇంటికి వస్తుండగా తల్లిని చూసిన ప్రహర్షిక ఒక్కసారిగా పరుగెత్తుతూ కిందపడిపోయింది. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు చెప్పారు. చిన్నారి గుండెపోటుతో మరణించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.