గోదావరి తీరం కూడా ఒకనాటి కరువు ప్రాంతం

67చూసినవారు
గోదావరి తీరం కూడా ఒకనాటి కరువు ప్రాంతం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ధాన్యాగారంగా పిలుచుకునే గోదావరి జిల్లాల్లో కూడా కరువు సమస్య ఏర్పడింది. విస్తారమైన భూభాగం ఉన్నప్పటికీ నాడు వర్షాధారంగా పంటలు పండించేవారు. 1833లో సంభవించిన నందన క్షామం వల్ల దాదాపు రెండు లక్షల మంది కరవు బారిన పడినట్టు నాటి ప్రభుత్వ లెక్కల్లో ఉంది. 1839లో కోస్తా ఆంధ్రలో పెనుతుపాన్‌, ఉప్పెన తాకిడికి సుమారు 2లక్షల మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. బ్రిటిష్‌ ప్రభుత్వం స్పందించి కారణాలు తెలుసుకుని నివేదిక పంపాల్సిందిగా కాటన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్