ఇంటిలో భోజనం తయారీ వ్యయం ఈ ఏడాది జనవరిలో పెరిగిందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. శాకాహార భోజనం ప్లేటు ధర 2024 జనవరిలో రూ.28 కాగా, గత నెలలో రూ.28.70కు పెరిగింది. బంగాళాదుంపల ధర 35%, పప్పుల ధర 7%, వెజిటబుల్ ఆయిల్స్ ధర 17% పెరగడం ఇందుకు కారణమంది. మాంసాహార థాలీ ప్లేటు ధర ఏడాది వ్యవధిలో రూ.52 నుంచి రూ.60.6కు చేరింది. మొత్తం ప్లేటు ధరలో 50% వాటా ఉండే బ్రాయిలర్ చికెన్ ధర 33% పెరగడమే ఇందుకు కారణం.