ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హయాంలోనే దేశం సురక్షితంగా మారిందని, భారత్‌లో రక్తం చిందించడానికి తాము అనుమతించబోమని వ్యాఖ్యానించారు. అలా చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ప్రపంచ వ్యాప్తంగా సందేశాన్ని పంపిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి రోజూ ఉగ్రదాడులు జరిగేవంటూ పేర్కొన్నారు.