TG: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమిస్తున్నాయి. దీనిపై శనివారం 'చలో సెక్రటేరియట్' కార్యక్రమానికి కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ ధర్నాకు మద్దతిస్తూ బీఆర్ఎస్, బీజేపీలు కూడా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. రానున్న రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారే అవకాశం కనిపిస్తోంది.