తెలంగాణ కులగణన సర్వే నివేదికపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయొద్దని అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కులగణనతో ఏళ్లుగా ఉన్న బీసీల కల నెరవేరిందన్నారు. ప్రతి రాజకీయ పార్టీ దీనిని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వేతో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. గతంలో ఇలాంటి గణన చేయలేదని, ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు లేవని తెలిపారు. కులగణన డేటా సేకరణ దేశానికే ఆదర్శమన్నారు.