కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ వెలుగు వెలిగిందని BRS నేత RS ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక 660 గురుకులాలు పెట్టారని.. సైనిక, న్యాయ, ఫ్యాషన్, మెడికల్, సంగీతం కాలేజీలు ఏర్పాటు చేశారని కొనియాడారు. 'కేసీఆర్ బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టారు. మన ఊరు మన బడి కింద పాఠశాలలు అభివృద్ధి చేశారు. సీఎం కావాలని విద్యా శాఖను తనవద్ద ఉంచుకున్నారు. కావాలనే విద్యా రంగాన్ని సీఎం నాశనం చేస్తున్నారు' అని విమర్శించారు.