భారత రవాణా రంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్, పట్టణ ప్రాంతాల్లో హైపర్ లూప్ కనెక్టివిటీ, రోప్‌వేస్, కేబుల్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో మొబైల్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలు ఉంటాయని, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ తయారీకి 11 ప్రముఖ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.