ఇద్దరు కూతుళ్లను కాలువలో పడేసి తండ్రి ఆత్మహత్యాయత్నం

56చూసినవారు
ఇద్దరు కూతుళ్లను కాలువలో పడేసి తండ్రి ఆత్మహత్యాయత్నం
ఏపీలో మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో కూతుళ్లను తండ్రే కాలువలో పడేసిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ముప్పాళ్ల అద్దంకి బ్రాంచి కాలువలో తండ్రి తన ఇద్దరు బాలికలు యామిని(11), కావ్య(7),ను తోసేశాడు. అనంతరం తాను అదే కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి తండ్రిని కాపాడారు. ఇద్దరు బాలికలు కాలువలో గల్లంతయ్యారు.

సంబంధిత పోస్ట్