ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ట్రోపీని ఎలాగైన ముద్దడాలని టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే మైదానంలో చెమటలు చిందిస్తున్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు సమాచారం.