పాముతో ఫొటో దిగాలని బలవంతం పెట్టిన మిత్రులు.. చివరికి

582చూసినవారు
పాముతో ఫొటో దిగాలని బలవంతం పెట్టిన మిత్రులు.. చివరికి
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు తన పుట్టినరోజున పాము కాటుకు గురై మృతి చెందాడు. చిఖాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిఖిలీలోని గజానన్ నగర్‌లో నివాసం ఉంటున్న సంతోష్ జగ్దాలే (31) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు ఆరిఫ్ ఖాన్, ధీరజ్ పండిట్కర్‌లతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో పాముతో ఫొటో దిగాలని మిత్రులు బలవంతం పెట్టారు. దీంతో విషసర్పాన్ని అతడు చేతిలో పట్టుకున్నాడు. పాము కాటు వేయడంతో మరణిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్