కేసీఆర్ త్యాగాల ఫలం తెలంగాణ, ఉద్యమ ఫలితమే తెలంగాణ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినాదమిచ్చి మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు నవంబర్ 29 అని చెప్పారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి.. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భమని ఎక్స్ వేదికగా వెల్లడించారు.